Kitchen tips: వంట ఇంట్లో ఆరోగ్యకరమైన చిట్కాలు..! 10 d ago
కిచెన్‌లో వంట చేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేయకుండా, ఆరోగ్యానికి ముప్పురాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడము చాలా ముఖ్యం. వంట చేసే క్రమంలో చిన్న చిన్న చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మూత పెట్టడం మర్చిపోవద్దు:
వంట చేసే క్రమంలో గిన్నెలపై మూత పెట్టడం చాలా ముఖ్యం. మూత పెట్టకపోతే, వంట ఆలస్యమవుతుంది, అధిక పొగ వెలువడుతుంది, మరియు 20% అదనంగా ఇంధనం వృథా అవుతుంది. కాబట్టి, ప్రతిసారీ వంట చేసే సమయంలో గిన్నెలపై మూత పెట్టడం ఉత్తమం.
చిన్న ముక్కలుగా కట్ చేయండి:
కాయగూరలను పెద్ద ముక్కలుగా తరిగితే అవి ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీని వల్ల గ్యాస్ వృథా అవుతుంది మరియు వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి కాయగూరలను చిన్న ముక్కలుగా కట్ చేస్తే వేగంగా ఉడికిపోతాయి, కాలుష్యం తగ్గుతుంది మరియు వంట రుచిగా ఉంటుంది.
పెద్ద గిన్నెలు ఉపయోగించండి:
చిన్న గిన్నెలను ఉపయోగించడమువల్ల స్టౌపై మంట బాగా విస్తరిస్తుంది, ఈ సమయంలో ఇంధనం వృథా అవుతుంది. వంటింట్లో కాలుష్యం పెరుగుతుంది. పెద్ద గిన్నెలు ఉపయోగించడం లేదా ఇండక్షన్ స్టౌ వాడటం అనేది మంచి ప్రత్యామ్నాయం.
ఎలక్ట్రానిక్ కెటిల్ వాడండి:
నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రానిక్ కెటిల్ వాడటం ఉత్తమం. గ్యాస్ వృథా కాకుండా, నీటిని వేడి చేయడంలో ఎక్కువ సమయం పట్టదు. అలాగే, కాయగూరలు ఉడికించడం వలన పోషకాలు కోల్పోవడం నివారించవచ్చు.
కంపోస్ట్ ఎరువుగా మార్చండి:
వంటింట్లో పోగయ్యే చెత్తను, కుళ్లిపోయిన కాయగూరలు, పండ్లు, టీబ్యాగ్స్, కోడిగుడ్డు పెంకులు ఇలా అన్నింటిని కలిపి కంపోస్ట్ ఎరువుగా మార్చడం పర్యావరణానికి మంచిది. దీన్ని ఇంట్లో మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు.
నో ప్లాస్టిక్:
ప్లాస్టిక్ వాడకం తగ్గించడం వలన పర్యావరణానికీ, ఆరోగ్యానికీ మంచిది. ప్లాస్టిక్ బ్యాగ్స్, కంటైనర్లకు బదులుగా, క్లాత్ బ్యాగ్స్, గాజు, స్టీల్, లేదా సిలికాన్ డబ్బాలు ఉపయోగించడం ఉత్తమం.
ఈ చిట్కాలు పాటిస్తే, వంట ఇంట్లో కాలుష్యం తగ్గించవచ్చు, పర్యావరణం పరిరక్షించవచ్చు, ఆరోగ్యకరమైన వంటలు చేయవచ్చు.